టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. గత గురువారం సన్‌రైజర్స్ హైదరబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని సన్‌రైజర్స్ ఓపెనర్ అలెక్స్‌హేల్స్ మిడాన్ దిశగా ఆడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న టీమ్ సౌథి ముందుకు వచ్చి అద్భుతంగా అందుకున్నాడు.