8 సెకన్లలో.. 6 క్యాచ్‌లు..ఒక్కటీ మిస్‌ కాకుండా! | Rashid accepts Kohlis quirky catches challenge | Sakshi
Sakshi News home page

8 సెకన్లలో.. 6 క్యాచ్‌లు..ఒక్కటీ మిస్‌ కాకుండా!

Aug 25 2018 1:28 PM | Updated on Mar 20 2024 3:13 PM

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలెంజ్‌లు ఎక్కువయ్యాయి. మొన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఫిట్‌నెస్ చాలెంజ్‌కు స్వీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మరొక చాలెంజ్‌ విసరగా, ఇప్పుడు తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ చాలెంజ్‌ను విసిరాడు.

తనకంటే తక్కువ సమయంలో ఈ  చాలెంజ్‌ను ఎవరైనా పూర్తి చేయగలరా? అని అడిగాడు. ఇంతకీ కోహ్లి విసిరిన చాలెంజ్‌ ఏంటని అనుకుంటున్నారా? క్యాచ్‌లు పట్టడం. క్యాచ్‌లు పట్టడం ఏముందని అనుకుంటున్నారా? అయితే, ఈ క్యాచ్‌లను కాస్త వైరటీగా పట్టాలి. అవి ఎలా పట్టాలో కూడా విరాట్ కోహ్లి తాను పోస్టు చేసిన వీడియోలో చేసి చూపించాడు."8 సెకన్లలో.. ఆరు క్యాచ్‌లు... ఒక్కటీ మిస్‌ అవ్వకుండా పట్టాను. మీరు నా కంటే తక్కువ సమయంలో పట్టగలరా?" అంటూ కోహ్లి... కేఎల్‌ రాహుల్‌, జాంటీ రోడ్స్‌, రషీద్‌ఖాన్‌, డుప్లెసిస్‌, షకీబ్‌ ఆల్‌ హాసన్‌, గిబ్స్‌కు సవాల్ విసిరాడు. ఈ సవాల్‌ను రషీద్‌ ఖాన్‌ స్వీకరించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement