వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్ అనిపించాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భాగంగా డీకాక్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్(42; 30 బంతుల్లో 9 ఫోర్లు) ధాటిగా ఆడే క్రమంలో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో భాగంగా క్రిస్ మోరిస్ వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని సౌమ్య సర్కార్ పుల్ చేయబోయాడు. అది సర్కార్ అంచనా తప్పి గ్లౌవ్‌ను ముద్దాడుతూ వికెట్లకు వెనకాలే పైకి లేచింది.