ఆ సిక్స్‌తో స్కోరు బోర్డు చెల్లాచెదురు! | Pooja Vastrakar breaks shackles and scoreboard | Sakshi
Sakshi News home page

ఆ సిక్స్‌తో స్కోరు బోర్డు చెల్లాచెదురు!

Mar 16 2018 4:58 PM | Updated on Mar 22 2024 11:07 AM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా  గురువారం ఆస్ట్రేలియా మహిళల జట్టుతో  జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 60 పరుగుల తేడాతో ఓటమి పాలై  సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పూజా వస్త్రాకర్‌ కొట్టిన ఓ సిక్స్‌ స్కోరు బోర్డును చెల్లాచెదురు చేసింది. 40వ ఓవర్‌లో జోనాసెన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న పూజ.. దాన్ని సిక్స్‌ కొట్టింది. అది కాస్త బౌండరీ లైన్‌ ఆవల ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. దీంతో స్కోరు బోర్డు చెల్లా చెదురైంది. దీనికి బౌలర్‌ జోనాసెన్‌ కూడా పూజాను అభినందించలేకుండా ఉండలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement