ఇంగ్లండ్‌లో జరుగుతున్న కియో సూపర్ లీగ్‌లో భారత మహిళా క్రికెటర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఓపెనర్ స్మృతి మంధాన రికార్డులు సృష్టిస్తుండగా.. తాజాగా భారత టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తోడైంది. మంగళవారం లాన్స్‌షైర్ థండర్స్, సర్రేస్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన హర్మన్.. తనదైన శైలిలో రెచ్చిపోయింది. లాన్స్‌షైర్ థండర్స్ తరుపున బరిలోకి దిగిన హర్మన్.. చివరి ఓవర్లలో సిక్స్, ఫోర్ బాధి ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్నందించింది. ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ 1 సిక్స్, 3ఫోర్లతో 34 పరుగులతో లీగ్‌ను ఘనంగా ఆరంభించింది