భారత మహిళల జట్టు సఫారీ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–1తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది.