అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో తొలిసారిగా ఆడుతున్న జపాన్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. దీంతో అండర్–19 వరల్డ్‌కప్ చరిత్రలో సంయుక్తంగా రెండో అతి తక్కువ పరుగుల రికార్డును నమోదు చేసింది. 2002 అండర్–19 వరల్డ్ కప్‌లో కెనడా, 2008లో బంగ్లాదేశ్ 41 పరుగులకు ఆలౌట్ కాగా, 2004లో స్కాట్లాండ్ జట్టు 22 పరుగులకే ఆలౌట్ అయి మొదటి స్థానంలో నిలిచింది.
41 పరుగులకే ఆలౌట్
Jan 21 2020 7:02 PM | Updated on Jan 21 2020 7:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement