దళితుల గురించి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వారిని చంద్రబాబు గతంలో అవమానించారని మండిపడ్డారు.