‘పాదయాత్రలో ప్రజలు నాతో చెపుకున్న బాధలు, నేను చూసిన వారి కష్టాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.