ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్‌

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని రాహుల్‌ గాంధీకి ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. రాహుల్‌ వయనాడ్‌ నియోజకవర్గ పర్యటనలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం రాహుల్‌ గాంధీ వయనాడ్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఓ అభిమాని రాహుల్‌ వాహనం దగ్గరకు వచ్చి తొలుత షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్‌ చేయి పట్టుకుని లాగి అతని బుగ్గపై ముద్దు పెట్టి అంతేవేగంగా వెళ్లి పోయాడు. ఈ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు రాహుల్‌. కానీ వెంటనే తేరుకుని ఆ తర్వాత వచ్చిన వారిని పలకరించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top