పొదుపు సంఘాల కార్యకలాపాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే గ్రామ సంఘ సహాయకురాలు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్(ఆర్‌పీ)లకు ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనాన్ని రూ.10,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 1వ తేదీ నుంచి గౌరవ వేతనాల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. పొదుపు సంఘాల సభ్యుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం లాంటి కీలక పనులను వీవోఏ, ఆర్పీలు నిర్వహిస్తుంటారు. వీవోఏలను గతంలో యానిమేటర్లు, సంఘమిత్రలు అని పిలిచేవారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 27,797 గ్రామ సమాఖ్యలు, పట్టణ ప్రాంతాల్లో 8,034 ఎస్‌ఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్‌లున్నాయి. గ్రామ సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది వీవోఏలు, ఆర్పీలు పర్యవేక్షిస్తున్నారు.
జీతాలు పెరిగాయ్!
Nov 12 2019 7:35 AM | Updated on Nov 12 2019 7:43 AM
Advertisement
Advertisement
Advertisement
