వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పక్కబెట్టిన చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణాల గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.