కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సచివాలయంలో పర్యటిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు సోమవారం ఉదయం సచివాలయంలోని అన్ని బ్లాకులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయం నిర్మాణాలు , నూతన నిర్మాణ భూమి పూజ ప్రాంగణాన్ని నేతలు పరిశీలించారు. కాగా అంతకు ముందు పోలీసులు... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాహనాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు వాహనాన్ని కూడా పోలీసులు మధ్యలోనే ఆపేశారు. అనంతరం వారిని లోనికి అనుమతించారు.