అధికారపార్టీకి ఓటమి తప్పదని తెలిసి బరితెగించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సర్వేల పేరుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. మంగళగిరిలో ఆదివారం సర్వే చేస్తున్న యువకులపై అనుమానం వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరాలు సేకరించగా వారు చెప్పిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. సర్వే పేరుతో ఇళ్లకు వెళ్తున్న యువకులు వారి ట్యాబ్‌లోని ఓటర్ల జాబితాను చూసుకుని ఓటర్ల ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ సేకరించి ఆన్‌లైన్‌లో మరో సర్వర్‌కు పంపుతున్నారు.