అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ఇక్కడ సీఎం కేసీఆర్ ఇద్దరి శైలి ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అంటారు.. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని కేసీఆర్ చెబుతారు. రఫెల్ కాంట్రాక్ట్ కోసం ప్రధానితో పాటు అనిల్ అంబానీ ఫ్రాన్స్ వెళ్లారు.