‘‘నాలుగేళ్లు మాతో స్నేహం చేసిన పవన్ కల్యాణ్ ఒక్కరోజులో మారిపోయి అభాండాలు వేస్తున్నారు. నేను అవినీతికి పాల్పడ్డానని అంటున్నారు. ఆయన దగ్గర ఆధారాలుంటే నేరుగా నాకే ఫోన్ చేసి అడగొచ్చుకదా, పవన్‌కు నా మొబైల్ నంబర్ కూడా తెలుసు కదా..’’ అని వాపోయారు మంత్రి నారా లోకేశ్! తనపై, తండ్రి చంద్రబాబుపై జనసేనాని చేసిన సంచలన వ్యాఖ్యలకు ఆలస్యంగా స్పందించారు. అమరావతిలోని టీడీఎల్పీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. పవన్‌కు గట్టికౌంటర్ ఇచ్చేయత్నం చేశారు.