విద్యుత్‌ తీగలు పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య | MAN TOUCHES LIVEWIRE AT RAILWAY STATION, DIES | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య

Apr 25 2019 2:24 PM | Updated on Apr 25 2019 2:33 PM

నగరంలోని మేజిస్టిక్‌ రైల్వే స్టేషన్‌లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు పైకి ఎక్కిన ఓ వ్యక్తి.. విద్యుత్‌ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు ఎక్కిన అనంతరం తాను కరెంట్‌ తీగలను పట్టుకుంటున్నానని గట్టిగా అరిచాడు. అక్కడున్న స్థానికులు,రైల్వే సిబ్బంది అప్రమత్తమై అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అతడు విద్యుత్‌ తీగలను పట్టుకున్నాడు.

క్షణాల్లోనే రైలుపై నుంచి సదరు వ్యక్తి కిందకు పడిపోయాడు.ఇదంతా అక్కడ ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ఇప్పుడా వీడియో వైరల్‌ దఅయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రైల్వే స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement