15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్‌ | KTR Holds Review Meeting Over Viral Fever | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్‌

Sep 9 2019 8:09 PM | Updated on Mar 22 2024 11:30 AM

అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అవగాహన సదస్సులతో పాటు త్వరలోనే మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం ఆయన మంత్రి ఈటల రాజేందర్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విష జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతోనే విషజ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రమంతటా ప్రజలు వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. అందరికి వైద్యం అందేలా ప్రభుత్వం యుద్ధప్రాతిక చర్యలు చేపబట్టబోతుందన్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement