వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులను కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. అదే తరహాలో ఈ కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రియాంక హత్యపై స్పందించిన సీఎం కేసీఆర్
Dec 1 2019 6:41 PM | Updated on Dec 1 2019 6:47 PM
Advertisement
Advertisement
Advertisement
