ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సోమవారం చర్చ మొదలైంది. కాకాని గోవర్థన్ రెడ్డి గవర్నర్ ప్రసంగాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు.