వైఎస్సార్‌సీపీ నేత కత్తుల రవికుమార్‌కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైఎస్సార్‌సీపీ నేత రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే.