కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు కొండచరియాలు విరిగిపడటంతో రవాణ స్థంభించింది. ముఖ్యంగా కొడుగు జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో సహాయక బృందాలు హెలికాప్టర్ సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది.ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు అక్కడి దారుణ పరిస్థితి తెలుపుతున్నాయి.