ఈ నిర్ణయం పోలీస్‌ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు | Gautam Sawang Praises Police weekly Offs | Sakshi
Sakshi News home page

ఈ నిర్ణయం పోలీస్‌ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు

Jun 18 2019 8:34 PM | Updated on Mar 22 2024 10:40 AM

పోలీస్‌ శాఖలో వీక్లీ ఆఫ్‌ అమలు చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. పోలీసు వీక్లీ ఆఫ్‌లకు సంబంధించి డీజీపీ మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్‌ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని ఆయన అభివర్ణించారు. ఈ స్పూర్తితో పోలీసులు మరింత మెరుగైన సేవలతో ప్రజలకు చేరువ అవుతారని పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement