ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో ఉన్న విడిభాగాల ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం మంటలంటుకున్నాయి. ఇవి మరింత విస్తరించి భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది.