జవాన్ల తల్లులకు నిర్మలా సీతారామన్ పాదాభివందనం | Defence Minister Nirmala Sitharaman touches feet of martyr's mother | Sakshi
Sakshi News home page

జవాన్ల తల్లులకు నిర్మలా సీతారామన్ పాదాభివందనం

Mar 5 2019 9:11 AM | Updated on Mar 22 2024 11:16 AM

పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో సోమవారం జరిగిన ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర జవాన్ల తల్లులను, సతీమణులను ఆమె ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించారు. అనంతరం జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement