వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే దానిమీద నిలబడతారని దాసరి జై రమేష్ అన్నారు. ఆయన శుక్రవారం వైఎస్ జగన్‌ను హైదరాబాద్‌లో కలిశారు. భేటీ అనంతరం దాసరి జై రమేష్ వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జై రమేష్ తెలిపారు.