సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో మూడు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విజయవాడ నగరంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన కుమ్మరిపాలెం, పాత రాజరాజేశ్వరి పేట, ఖుద్దూస్ నగర్, రాణిగారి తోట, పాయకాపురం, సనత్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. రెడ్‌జోన్లలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాల వద్ద శానిటేషన్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ప్రాంతమంతా సోడియం క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. పది డ్రోన్లు, ప్రత్యేక ట్రాక్టర్ల వినియోగంతో అణువణువూ యాంటి కరోనా స్ప్రేలను ఉపయోగిస్తున్నారు. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్‌ను ఫైర్ ఇంజిన్లతో స్ప్రే చేస్తున్నారు.