కేంద్రం ఆదుకోకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తే అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తమౌ తోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయా లపై వెనుకబడటం కంటే సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించుకుంటామని చంద్రబాబు వ్యాఖ్యా నించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ కేంద్రంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి అన్నారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ అట్టడుగున ఉందని, దీనికి కారణం విభజనతో తలెత్తిన కష్టాలేనని చంద్రబాబు పేర్కొన్నారు.
మిగిలిన రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకునే వరకు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ముఖ్యమంత్రి ఇపుడే ఏదో అన్యాయం జరుగుతున్నట్లు, కేంద్రం సహాయం చేయక పోతే ఏదో చేసేస్తానన్నట్లు మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వైఫ ల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇదో ఎత్తుగడ అని విమర్శకులంటున్నారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ను అమలు చేయడంలోనూ విఫలమ య్యారు. అన్ని విధాలుగా పూర్తిగా విఫలమైన సీఎం ఇపుడు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇలా తన వైఫల్య గళాన్ని వినిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేంద్రం అన్యాయం చేస్తే సుప్రీంకోర్టుకు
Jan 20 2018 7:11 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement