జీవో నంబర్‌ 2430ను చంద్రబాబు చదివారా?లేదా? | AP CM YS Jagan Speaks About GO Number 2430 | Sakshi
Sakshi News home page

జీవో నంబర్‌ 2430ను చంద్రబాబు చదివారా?లేదా?

Dec 12 2019 10:40 AM | Updated on Mar 20 2024 5:39 PM

ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశపూరిత కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకురావాలన్న జీవో నంబర్‌ 2430పై ప్రతిపక్ష టీడీపీ మరోసారి రాద్ధాంతం చేసింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు గురువారం అసెంబ్లీలో లేవనెత్తడంతో దీనిపై శాసనసభా పక్ష నేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభ వేదికగా దీటుగా బదులిచ్చారు. జీవో కాపీని క్షుణ్ణంగా చదివి సభ్యులకు వివరించిన ఆయన మాట్లాడుతూ.. ‘2430 జీవోను రద్దు చేయమని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ జీవోను అసలు చంద్రబాబు చదివారా? అందులో ఏం తప్పుంది? నాకు తెలిసి ప్రతిపక్ష నేతకు ఇంగ్లీష్‌ రాక, జీవో అర్థం చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నా.
 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement