గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్ప ప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో 10శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే ప్రతి 50 ఇళ్లకు అదనంగా ఒక వాలంటీర్‌ను నియమించామన్నారు.
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదే
Oct 2 2019 1:24 PM | Updated on Oct 2 2019 1:28 PM
Advertisement
Advertisement
Advertisement
