గుజరాత్‌లో శనివారం జరగనున్న తొలిదశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రల్లోని 89 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2.12 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, 22 ఏళ్ల అధికార వనవాసానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ భావిస్తుండటంతో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి.