సంగీతానికి రాళ్లయినా కరగాల్సిందే..! అనే సామెత మనందరికి తెలుసు. మనసుని ఉర్రూతలూగించే పాటకు ఎవరి పాదమైనా కదలక మానదు. ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. యూరో విజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన నెటా బార్జీలాల్ పాటకు నెతన్యాహు స్టెప్పులు వేశారు.