సల్మాన్‌ ‘సారే జహాసే అచ్చా’ వీడియో వైరల్‌  | Salman Khan Sings Saare Jahan Se Achcha Patriotic Song | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ‘సారే జహాసే అచ్చా’ వీడియో వైరల్‌ 

Aug 15 2020 12:23 PM | Updated on Mar 22 2024 11:24 AM

భారత దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ కళకారులు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా ఓ దేశ భక్తి పాట పాడి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రముఖ నిర్మాత  అతుల్ అగ్నిహోత్రి ఈ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌ అయింది. ఈ వీడియోలో సల్మాన్‌ ‘సారే జహాసే అచ్చా’అనే గీతాన్ని ఆలపించారు. విడియో చివరల్లో సల్మాన్‌ రెండు చేతులు జోడించి అందరికి నమస్కారం తెలియజేస్తాడు. అనంతరం మువ్వెన్నల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement