టాలీవుడ్ నటి మాధవిలత మరో అంశంపై తెరపైకి వచ్చారు. భారత్‌లో ఉన్న రూల్స్ చూసి సిగ్గుపడాలంటూ కామెంట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్‌కు వస్తున్నారన్న నేపథ్యంలో రంగులు వేస్తూ హడావుడి చేయడంపై మాధవిలత ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు సంబంధించిన సమస్యను చూపిస్తూ.. ఈ విషయంలో మహిళలకు సహకరించని ప్రభుత్వ నిబంధనలపై ఆమె మండిపడ్డారు.