ఇక టాస్క్ మొదటి రోజు అతి వినయం, అతి ప్రేమలతో సరదాగా సాగగా ముగ్గురు కోడళ్ల ముద్దుల అత్తగా శివజ్యోతి అలరించింది. అయితే ఎందుకైనా మంచిదని, అందరినీ ఓ కంట కనిపెట్టమంటూ అసిస్టెంట్ మహేశ్‌కు ఆర్డర్లు జారీ చేసింది . కాగా నేటి ఎపిసోడ్‌లో ఇంట్లో మళ్లీ గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. రాహుల్‌ను ఆపే ప్రయత్నం చేసింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని ప్రోమో లవర్స్ అంటున్నారు. మరి వీరి గొడవ టాస్క్ వరకేనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది!
బిగ్‌బాస్: కొట్టేస్తావా నన్ను..?
Sep 25 2019 10:58 AM | Updated on Sep 25 2019 12:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement