పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సీపీఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి గురువారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ నగదు రద్దు కారణంగా దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. టెక్స్‌టైల్స్, ప్రభుత్వం రంగాల్లోని 3319కోట్ల మంది ఉద్యోగులు జీతాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.