సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు | Singapore PM cancels visit to Amaravati | Sakshi
Sakshi News home page

Oct 6 2016 6:52 AM | Updated on Mar 21 2024 7:52 PM

సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు స్విస్ ఛాలెంజ్ టెండర్ విధానం అత్యంత వివాదాస్పదమైన నేపథ్యంలోనే అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్.. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించాలని సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 3న ఢిల్లీకి చేరుకున్నారు. ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన ఆయన బుధవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement