ఢిల్లీలో మారిన సీమాంధ్ర నేతల వ్యూహం | Seemandhra Congress Leaders Dharna in Delhi | Sakshi
Sakshi News home page

Aug 13 2013 10:32 AM | Updated on Mar 21 2024 8:40 PM

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యూహం మార్చుకున్నారు. తొలుత జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని తలపెట్టినా, అధిష్ఠానం మందలింపుతో తమ నిరసన వేదికను మార్చుకున్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ హెచ్చరిక నేపథ్యంలో బహిరంగ ప్రదేశంలో కాకుండా.. పార్లమెంటు వేదికగానే తమ నిరసన తెలపాలని, అది కూడా తీవ్రస్థాయిలో ఉండేలా చూడాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 60 మందికి పైగా పార్లమెంటు పాసులు తీసుకున్నారు. వీరిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అందరూ ఉన్నారు. పార్లమెంటు ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక సమయంలో భారీ సంఖ్యలో, అంటే సుమారు వంద మంది కలిసి ఒకే చోట గుమిగూడి పార్లమెంటు ప్రాంగణంలోనే.. గాంధీ విగ్రహం లేదా ఏదో ఒక ప్రదేశం వద్ద భారీగా నిరసన తెలియజేయాలనే వ్యూహం రూపొందించుకున్నట్లు సమాచారం

Advertisement
 
Advertisement

పోల్

Advertisement