ఓటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న సెబాస్టియన్కి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అద్దెకి దిగిన ఇంటినే కబ్జా చేయాలని చూస్తున్నాడని యజమాని ఫిలిప్స్ అవేధన వ్యక్తం చేశారు. 2003 లో సెబాస్టియన తన భార్య పేరు మీద ఎర్రగడ్డలోని తమ ఇంట్లో అద్దెకి దిగాడని చెప్పారు. 2008 లో తమకే ఇళ్లు అవసరం ఉందని ఖాళీ చేయాల్సిందిగా కోరగా, వాళ్ల బాబుకు పరీక్షలు ఉన్నాయని చెప్పి.. ఆ తర్వాత ఖాళీ చేయడానికి నిరాకరిండాని చెప్పారు.