రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తొలిరోజు బుధవారం ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా సామాన్యులు, పేద వర్గాలు ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. మరోవైపు మార్కెట్ లో చిల్లర కొరత తీవ్రమైంది. 50 రూపాయల వస్తువేదైనా కొనుగోలు చేసి షాపు యజమానికి వంద రూపాయలు ఇస్తే తిరిగి చెల్లించడానికి చిల్లర లేదని చెబుతున్నారు.