ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మాట నిలుపుకుంది. ఉత్తరప్రదేశ్ లో తాము అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో మంత్రి గాయత్రి ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన మాట నిజమైంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని లక్నోలో అరెస్ట్ చేశారు. తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదు కావడంతో ఫిబ్రవరి 27 నుంచి ఆయన పరారీలో ఉన్నారు.