నోట్ల రద్దుపై నేడు దేశ వ్యాప్తంగా నిరసనలు | Protests today on demonetization | Sakshi
Sakshi News home page

Nov 28 2016 7:00 AM | Updated on Mar 21 2024 10:56 AM

కేంద్రం తీసుకున్న రూ. 500, రూ. వెరుు్య నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా విపక్షాలు ‘జన్ ఆక్రోశ్ దినం’ పేరుతో నిరసనలను చేపడతున్నాయి. విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయని గతంలో వార్తలు వచ్చినప్పటికీ..బంద్ కాదనీ, కేవలం నిరసనలేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పష్టం చేసింది. తాము నిరసనలు చేపడుతుంటే, బీజేపీ వాటిని ‘భారత్ బంద్’ అంటూ ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సోమవారం నాటి నిరసనల్లో పాల్గొననున్నారుు. కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడీయూ మాత్రం నోట్ల రద్దును సమర్థిస్తూ నిరసనలు చేపట్టడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement