‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ (ఓఆర్‌ఓపీ) అంశంలో ప్రధాని మోదీ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మోదీ చెప్పినట్టు మాజీ సైనికోద్యోగులకు అందుతోంది ఓఆర్‌ఓపీ కాదని... సాధారణ పెన్షన్ మాత్రమేనన్నారు. ‘మోదీజీ... ఇకనైనా మీ అబద్ధాలు కట్టిబెట్టండి’ అని అన్నారు. 70 మంది మాజీ సైనికోద్యోగులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. . ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓఆర్‌ఓపీ మిలిటరీ సిబ్బంది హక్కని, ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వెల్లడించారు.