కాపు రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో మరోదఫా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాపునేత ముద్రగడ పద్మనాభం సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో 'ఛలో అమరావతి'కి ఆయన పిలుపునిచ్చారు.