ప్రధానిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు | Modi committed to the corruption | Sakshi
Sakshi News home page

Dec 15 2016 10:17 AM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం.. 15 విపక్షాల నేతలతో కలసి రాహుల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారనేందుకు తన వద్ద కీలక సమాచారం ఉందని వెల్లడించారు. అందుకే తాను లోక్‌సభలో మాట్లాడతానంటే ఆయన భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. తన వద్ద ఉన్న సమాచారం వెల్లడిస్తే మోదీ బుడగ బద్ధలవుతుందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement