మెదక్ జిల్లా కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్ క్వార్టర్స్‌లో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్‌ఐ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తాను ఉద్యోగం మానేస్తానని నిన్న (మంగళవారం) రాత్రి భార్యకు రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.