'విభజన పాపం మూమ్మాటికీ టీడీపీదే' | Jogi Ramesh Press Meet 7th Aug 2013 | Sakshi
Sakshi News home page

Aug 7 2013 4:38 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి టీడీపీనే కారణమని వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చీడపురుగులని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు పొలిట్‌బ్యూరోలో అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. ఆ లేఖ ఇచ్చినపుడు టీడీపీ నేతలు నిద్రపోయారని జోగి రమేష్ ప్రశ్నించారు. రాజీనామాలు చేశామంటున్న కాంగ్రెస్ నేతలు అధికారాన్ని వాడుకుంటున్నారనిఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా గురువారం ఉ. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకూ రోడ్డుపైనే వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జోగి రమేష్ ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement