‘తూతూగానా?.. మాట్లాడే చాన్స్‌ ఇవ్వరా!’ | jana reddy takes on telangana government | Sakshi
Sakshi News home page

Apr 30 2017 12:37 PM | Updated on Mar 21 2024 8:11 PM

తూతూ మంత్రంగా తెలంగాణ రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. మిర్చీ రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని జనారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అయింది. పది నిమిషాల్లోనే బిల్లుపై చర్చ జరగకుండానే బిల్లుకు ఆమోదం తెలిపి సభను నిరవధిక వాయిదా వేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement