ములాయం సింగ్‌ యాదవ్‌కు మరో షాక్‌! | I am not on any side, says Amar Singh | Sakshi
Sakshi News home page

Jan 18 2017 10:39 AM | Updated on Mar 22 2024 11:06 AM

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష హోదాను, సైకిల్‌ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలోఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌కు మరో షాక్‌! ఎవరికోసంమైతే కొడుకును సైతం వదులుకోవడానికి నేతాజీ సిద్ధపడ్డాడో.. ఆ ప్రియనేస్తం అమర్‌సింగ్‌ బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం! సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలకు అసలు కారకుడిగా, 'శకుని మామ'గా విమర్శలు ఎదుర్కొన్న అమర్‌ సింగ్‌.. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం వెలువడకముందే లండన్‌ వెళ్లిపోయారు. 'నేను ఎప్పటికీ నేతాజీ(ములాయం) మనిషినే'అని పలుమార్లు బల్లగుద్దిచెప్పిన అమర్‌సింగ్‌.. సడన్‌గా సైడ్‌ మార్చారు. మంగళవారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement