ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే! | Sakshi
Sakshi News home page

ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే!

Published Thu, Oct 27 2016 7:08 AM

స్విస్ చాలెంజ్ విషయంలో రాష్ర్టప్రభుత్వం వెనక్కి తగ్గిందా? న్యాయస్థానం పలుమార్లు అక్షింతలు వేయడం, అనేక తప్పులు ఎత్తి చూపడం వల్ల రాష్ర్టప్రభుత్వం మనసు మార్చుకుందని భావించవచ్చా? గత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పినంత మాత్రాన స్విస్ చాలెంజ్ ప్రమాదం తొలగిపోయినట్లేనా? ఎంతమాత్రమూ లేదని అధికార వర్గాలంటున్నాయి. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు నివేదించడం కూడా ఓ డ్రామాయేనని, స్విస్‌చాలెంజ్‌ను కానీ, సింగపూర్ కంపెనీల కన్సార్టియంను కానీ వదులుకునే ఆలోచనే ప్రభుత్వానికి లేదని అధికారులు అంటున్నారు. కొత్త రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే ఒకవైపు న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే హడావిడిగా స్విస్ చా లెంజ్ అమలు కోసం ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు.